Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బానిస జీవుల బాధలొకవైపు, భోగజీవుల ఆనందాలొకవైపు, స్వతంత్య్ర కాంక్షల ఉద్యమాలొకవైపు, సామ్రాజ్యవాదుల పెత్తనమొక వైపు ఉన్న గడ్డు రోజుల్లో కాళోజి, దాశరథి వంటి మహనీయులు తెలంగాణలో పుట్టుకొచ్చారు. అలాంటి వారి సరసన ఉద్యమంలో పాల్గొన్న హైదరాబాద్ స్వాతంత్య్ర సమరయోధుడే బిరుదురాజు రామరాజు.
జననం, విద్యాభ్యాసం
బిరుదురాజు రామరాజు వరంగల్ జిల్లాలోని దేవనూర్ గ్రామంలో ఏప్రిల్ 16, 1925 లో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మీదేవి, నారాయణరాజు. వీరి విద్యాభ్యాసం కొంత మడికొండలో సాగింది. సహజంగా వరంగల్ ప్రాంతం సాంస్కతిక వాతావరణానికి పెట్టింది పేరు. కాకతీయుల కాలం నుంచి నేటి వరకు కళలకు కాణాచిగా ప్రసిద్ధి. అటువంటి పట్టణంలో రామరాజు గారు ఎదిగారు. ప్రాథమిక విద్యాభ్యాసం దేవనూరు, మడికొండలలో, ఉన్నత పాఠశాల విద్య హనుమ కొండలో, మాధ్యమిక విద్య వరంగల్లులో అభ్యసించారు.
వీరు నిజాం కళాశాలలో బి.ఏ. విద్యార్థిగా ఉన్నప్పుడు నిజాం రాష్ట్రంలోని పరిస్థితులను నిత్యం గమనిస్తూ ఉండేవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1949-51లో స్నాతకోత్తర విద్యను అధ్యయనం చేశారు. ఐదు భాషలలో పండితులు.
స్వాతంత్య్రోద్యమం
వీరు ఎం.ఏ లో చేరకముందే నిజాం సంస్థాన రాజుకు ప్రతిఘటనగా ''తెలంగాణ విద్యార్థి సంఘం'' స్థాపించి దానికి సభ్యులయ్యారు. ఈ సంఘం పక్షాన ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించవలసిందిగా సమాయత్తం చేశాడు. డా. జి.ఎస్.మెల్కొటే అధ్యక్షతన చేసిన సత్యాగ్రహంలో పాల్గొన్న కారణంగా అరెస్టయి జైలుకు వెళ్ళారు. జాతీయోద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ వరంగల్ చేరుకున్నప్పుడు అక్కడ పాదయాత్ర చేశాడు. వీరు వరంగల్లులో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆర్య సమాజానికి ప్రభావితులయ్యారు. ఇదే సందర్భంలో దాశరథి కష్ణమాచార్యలతో పరిచయమై నిజాం వ్యతిరేకోద్యమం లో పాల్గొన్నాడు. హయగ్రీవాచారి, జమలాపురం కేశవరావు, కాళోజిలతో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో అరెస్టయి మూడు నెలల పాటు జైలు శిక్షకు గురయ్యారు.
రచనలు
వీరి జానపద పరిశోధన తెలుగు గ్రామీణ సౌందర్యపు మట్టి వాసనలను, శ్రమైక జీవుల వినోద, గాథ గేయాలను, పాటలను, ఆటలను యావత్తు జానపదానికి సంబంధం ఉన్న సర్వకళలను సిద్ధాంత రూపంలో అందించారు. ఈ పరిశోధన చేయడానికి బిరుదురాజు గారు విశ్వవిద్యాలయ అధికారులతో పోట్లాడి మరీ 'జానపద గేయహిత్యం' అనే సిద్ధాంత గ్రంథాన్ని 1956 లో సమర్పించారు. ఇదే ఉస్మానియా తెలుగు శాఖ ద్వారా పొందిన మొదటి డాక్టరేట్ గా ప్రసిద్ధి పొందింది. 1962 లో ఉర్దూ-తెలుగు నిఘంటువును ప్రచురించారు. వీర గాథలు, తెలంగాణ పిల్లల పాటలు(1960), త్రివేణి (ఆంధ్రప్రదేశ్ జానపద గేయాల సంపుటి 1960), తెలంగాణా పల్లె పాటలు (1968) పుస్తకాలను ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ జానపద కథలు, జానపద విజ్ఞానంపై ఆంగ్లంలో రచించారు. హంబ్సన్ రాసిన 'గురుగోవింద్ సింగ్ జీవిత చరిత్ర'ను, ప్రకాశ్ చంద్రగుప్త రాసిన ప్రే'మ్ చంద్' రచన వంటి పలు ఇతర భాషల గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేశారు. ఆంధ్రయోగులు, చరిత్రకెక్కని చరితా ర్థులు, వీశీష్ట్రaతీతీaఎ ఖీశీశ్రీసరశీఅస్త్రర (1964), రశీబ్ష్ట్ర ఱఅసఱaఅ టశీశ్రీసరశీఅస్త్రర (1984), +శ్రీఱఎజూరవర శీట ్వశ్రీబస్త్రబ టశీశ్రీసశ్రీశీతీవ (1991) అనే ఆంగ్ల గ్రంథాలను ప్రచురించారు. ఇలా రామరాజు గారు తెలుగు జానపద సాహిత్యానికి చిరునామాగా నిలిచారు. ఒక్క జానపదమే కాక ప్రాచీన సాహిత్యంలో వెలుగులోకి రాని కొన్ని కావ్యాలను పరిష్కరించారు. ఉమ్మడిగా సంపాదక బాధ్యతలు చేపట్టారు.
ఇండియన్ ఫోక్లోర్ కాంగ్రెస్కు అధ్యక్షులయ్యారు. జానపద విజ్ఞాన సేకరణ ప్రాజెక్టు తెలంగాణకు సంచాలకుల య్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదువుకొని అక్కడే అధ్యాపకత్వం వహించి దశలుదశలుగా ఎదుగుతూ కళల విభాగానికి డీన్ అయ్యారు. కేవలం బోధనా రంగానికే పరిమితం కాకుండా పలు సాహిత్య సంస్థల నిర్వహణలకు పాటుపడ్డారు. అలా శ్రీ కష్ణదేవ రాయాంధ్ర భాషా నిలయానికి, ఆంధ్ర రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి వాటి అభివద్ధికి తోడ్పడ్డారు. జాతీయ సాహిత్య పరిషత్తుకు, ఆంధ్ర ప్రాచ్య మహాసభకు ప్రథమ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. చాలా అరుదుగా లభించే 'నేషనల్ లెక్చరర్' గౌరవం తెలుగు శాఖకు రామరాజు గారికే మొదటిసారి వచ్చింది. అంతవరకూ పాఠ్యాంశంగా లేనటువంటి జానపదాన్ని తొలిసారిగా రామరాజు గారే 1972 లో ఎం.ఏం.లో ప్రవేశపెట్టుటకు కషి చేశారు.
భారత సనాతన వైభవాన్ని, జాతీయవాదాన్ని అభిమానించే రామరాజుకు పుట్టపర్తి సాయిబాబాపై భక్తిగా మెండుగా ఉండేది. సాహిత్య రచనలకే పరిమితమవకుండా భక్తి రచనల వైపు కూడా దష్టి మరల్చి పలు గ్రంథాల్ని విరచించారు. పాతికేళ్ళలోనే అడ్డు అదుపు లేని నిజాం ప్రభుత్వంతో పోరాడి స్వాతంత్య్ర సమరయోధుడిగా కీర్తి గడించిన బిరుదురాజు రామరాజు గారు ఫిబ్రవరి 8, 2010లో అమరులయ్యారు.
- ఘనపురం సుదర్శన్,
9000470542