Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం ఈస్తటిక్స్ - 2022 పురస్కారాలకు ఆహ్వానం పలుకుతోంది. మూడు ఉత్తమ కథలకు ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులుగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ. 10 వేలు అందించనున్నారు. వీటితోపాటు మరో తొమ్మిది కథలను ఎంపిక చేసి పన్నెండు కథలను ఒక పుస్తకంగా తీసుకువస్తారు. కథలను పంపాలనుకునే వారు యూనికోడ్ ఫార్మాట్లో ఆగస్టు 31 నాటికి ఖమ్మం ఈస్తెటిక్స్ సాహిత్య పురస్కారాలు, 11-2-51, బాలాజీ నగర్, ఖమ్మం -507001 చిరునామాకు పంపాల్సి ఉంటుంది. వీటితో పాటు 2021 ఏప్రిల్, 2022 మార్చి నడుమ ప్రచురితమైన కవితా సంకలనాలలో ఉత్తమంగా ఉన్నదాన్ని ఎన్నుకుని రూ. 40 వేల నగదు బహుమతి అందజేస్తారు. వివరాలకు 9849114369 నంబరు నందు సంప్రదించవచ్చు.
- రవి మారుత్