Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు పేరుతో అందించే నాగభైరవ సాహితీ పురస్కారానికి ఈ ఏడాది సాహిత్య వ్యాస సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. 2018 నుంచి 2021 మధ్య ప్రచురింపబడిన వ్యాస సంపుటాలను నాలుగేసి ప్రతుల చొప్పున పంపాల్సి ఉంటుంది. ఎంపికైన సంపుటాలకు ప్రథమ, ద్వితీయ బహుమతులుగా రూ.10000/-, రూ.5000/- అందిస్తారు. ఆసక్తి కలిగిన వారు జూన్ 10లోగా డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, 202, శ్రీ వెంకటసాయి రెసిడెన్సీ, 2వ లైను, రామయ్య నగర్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 523002 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9849799711 నంబరు నందు సంప్రదించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.