Authorization
Tue April 01, 2025 03:04:31 am
జీవిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కవితల పోటీలకు వర్ధమాన కవుల నుంచి ''తోబుట్టువులు'' అనే అంశంపై కవితలను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు ఛైర్మన్ గుదిబండి వెంకట రెడ్డి పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు కవిత నిడివి 20 పంక్తులు మించకుండా రాసి, శ్రీమతి భవానీ రెడ్డి, బి70/ఎఫ్1, పి.ఎస్.నగర్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్-500057, తెలంగాణ చిరునామాకు అక్టోబర్ 31 లోగా పంపాలి. వివరాలకు 98498 82783 నంబరు నందు సంప్రదించవచ్చు.