Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాపోలు సీతారాబరాజు 'పరావర్తనం', సాహిత్య వ్యాసాలలో, 29 మంది కవుల రచనలపై వ్యాఖ్యాన, సమీక్షలున్నాయి. వివిధ పత్రికలు, సంకలనాలు, ముందుమాటలు, వ్యాఖ్యానాల రూపంలోని వ్యాసాలన్నీ అనుభూతి ప్రధానంగా చదివింపజేస్తున్నాయి. ఒక్క వేములవాడ భీమకవి, తప్ప ఈ సంపుటిలోని వ్యాసాలన్నీ ఇటీవలి సంవత్సరాలలో సాహిత్య రంగంలోకి వస్తున్న రచయితల మేలిమిని పాఠకులకు రచయిత పరిచయం చేసారు. కాలంతో నడుస్తున్న కవుల రచనలను విశ్లేషించి పాఠక హృదయాలను ఉద్దీపింప చేసే ప్రయత్నంతో, వ్యాసాల సంపుటిగా 'పరావర్తనం'గా సాహితీ కాంతి ప్రసరింపజేశారు. 'తెలంగాణ సాహిత్య వైభవ గీతాలు' (దేశపతి శ్రీనివాస్) 'తెలంగాణ సామ్రాజ్య ఘన చరితకు సంబంధించిన రాచకొండ' (నగేష్ బీరెడ్డి), 'తెలంగాణ చారిత్రాత్మక ప్రేమ సంబంధిత నవల' ఒక నజియా కోసం (నగేష్ బీరెడ్డి), 'సాఫ్ట్వేర్ నానీలు' (వంశీ), 'కోవిడ్ నానీలు' (హర్షవర్దన్), 'నానీల జీవధార' (శ్రీనివాస్), 'మేలిమి సాహిత్య వ్యాసాల కుందెన' (సాగర్ల సత్తయ్య) 'సమన్వయ వ్యాస సంపుటి' (డా.ఎస్.రఘు) కేవలం కవిత్వం పైనే కాకుండా వైవిధ్య భరితమైన వ్యాసాలు ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. 20 మంది కవులకు సంబంధించిన రచనలపై, రాపోలు వారి అధ్యయనం కేవలం ప్రశంసనీయంగా సాగింది. వ్యాస క్రమంలో డా.గోపి, యాకూబ్, నరసింహారెడ్డి, విల్సన్రావు, బుర్రా లక్ష్మీనారాయణ, తండ హరీష్, నాగజ్యోతి శేఖర్, తగుళ్ళ గోపాల్, గులాబీల మల్లారెడ్డి, పద్మావతి రాంభక్త, మెర్సీ మార్గరెట్, అరుణ నారదభట్ల, నస్రీన్ఖాన్, మెట్టా నాగేశ్వరరావు, దామెర రాములు, వడ్ల సత్యం, నందకిషోర్, ఉప్పల పద్మ, గౌతమ్ల కవిత్వంపై ప్రస్తుత నాలుగైదేళ్ళ సాహిత్యంపై సీతారామరాజు, అనుశీలనాత్మక అధ్యయనంగా ఈ వ్యాససంపుటి అభినందనీయం.
(పరావర్తనం (సాహిత్య వ్యాసాలు), రచయిత : రాపోలు సీతారామరాజు, పేజీలు : 160, వెల : రూ.150/-, ప్రతులకు : రాపోలు సీతారామరాజు, సరూర్ నగర్, హైదరాబాద్.
సెల్ : +27 72 774 7549;
పాలపిట్ట బుక్స్ - 9848787284)
- జయసూర్య, 9014948336