Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్.టి.ఆర్. ఆడిటోరియం, పిఎస్. తెలుగు యూనివర్శిటీ ఆధ్వర్యంలో అందిస్తున్న అమృతలత - అపురూప అవార్డుల ప్రదానోత్సవం ఈ నెల 8న సాయంత్రం 4:30లకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మభూషణ్ డా.కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, విశిష్ట అతిథిగా తెలంగాణ సాహిత్య అకామడీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, గౌరవ అతిథిగా నటీమణి రోజారమణి రానున్నారు. అమృతలత సాఫల్య పురస్కారాలను 'నవలా రచన' విభాగంలో డా.పరిమళా సోమేశ్వర్, రేడియో / టీవీ రంగం విభాగంలో శైలజా సుమన్; అపురూప పురస్కారాలను మంథా భానుమతి (పద్యరచన), వాడ్రేవు వీరలక్ష్మిదేవి (సాహితీవిమర్శ), ముంజులూరి కృష్ణకుమారి (బాలసాహిత్యం), ఘంటసాల నిర్మల (కవిత్వం), డా.రొంపిచర్ల భార్గవి (సినీ సంగీత సాహిత్య విశ్లేషణ), కోట్ల వనజాత (కథా రచన), అనుపమ కైలాష్ (నృత్యం), సాయిపద్మ (సామాజిక సేవ), సురభి ప్రభావతి (రంగస్థలం), సంగీత కళ, రాజ్యలక్ష్మి (కర్ణాటక సంగీతం) విభాగాలలో అందుకోనున్నట్లు కన్వీనర్ నెల్లుట్ల రమాదేవి పేర్కొన్నారు.