Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిమ్మపూడి శ్రీరామమూర్తి ముందుమాట రాసారు. 70 కి పైగా కవితలున్నాయి ఈ సంపుటిలో. మానవసంబంధాలు, కుటుంబ విలువలు, భాషాభిమానం, జ్ఞాపకాలు, శ్రమ, మనిషి, నైజం, బాల్యం, మధ్య తరగతి జీవులు, సరోగసి, అన్నదాత, స్త్రీ, పండుగలు, సమరం, గురువు లాంటివి వస్తువుగా తీసుకుని చక్కటి శబ్ధ, అర్థ భావాల్తో ఈ కవితలున్నాయి.
'రాక్షసత్వానికి సాధు ముసుగు ధ్యోతకమవుతోందేమిటి?
ఎన్ని సార్లు దుష్ట శిక్షణ జరిగినా! కలుపు మొక్కల్లా విస్తరిస్తున్నారు' (పేజీ 91) అంటారు దానవుడే మానవుడు కవితలో.
సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడమని అభ్యుదయ కవి ఆనాడు ఆశిస్తే నేడు... స్వార్థంతో బతికే మనుషుల తీరును 'ఛాయా విలాపం' కవితలో కవయిత్రి చివరను ఇలా అంటారు. ''ఎంతో మందిని నిచ్చెనలుగా మార్చుకుని ఎదిగిన నువ్వు / కనీసం ఒక్కరి ఉన్నతికైనా చెయ్యందించలేమని
నేనింత స్వార్థం పరుడికి నీడనా అని నీ నీడ కుమిలిపోతోంది'' -
స్త్రీలపై సాగే అత్యాచారాలపై 'యత్రనార్యస్తు' కవితలో దేశాన్ని ప్రశ్నిస్తారు? (పేజీ 72) ''శిశువులను సైతం / తమ పైశాచికత్వానికి బలి చేస్తున్నారు / అందుకే అంటున్నాను- మనది స్త్రీలను పూజించే దేశం కాదు - స్త్రీలను వేధించే దేశం అని''-
అలాగే 'త్వమేవాహం' అనే కవితలో చివరి వాక్యాలు (పేజీ 50) ఆలోచింపజేస్తాయి. ''ప్రేమ తోడుంటే అసాధ్యమనేదే లేదు - ఇరు హృదయాలు ''త్వమేవాహం'' అనే భావంలో పరవశించడమే నిజమైన నిర్మలమైన ప్రేమ!!'' అంటారు కవయిత్రి.
నిశాంత స్వప్నం, కాగితం పువ్వు, అనిమేషం, గతంగత:, మౌనవిపంచి, తెలుగు పిడుగు గిడుగు, దు:ఖిత తార, జ్ఞాపకాలు, పునర్జన్మ, లాంటి కవితల్లో కవయిత్రి చక్కటి అభివ్యక్తితో భాషా, భావ సౌందర్యంతో అంతర్లీనమైన అనుభూతి, ఆవేదన, అశావాహక దృక్పథం వెలుబుచ్చారు. వీరి లేఖిని నుంచి మరిన్ని శక్తివంతమైన కవితలు రావాలని ఆశిద్దాం.!
కవన దవనం
కవయిత్రి : సుజాత పి.వి.ఎల్.
పేజీలు : 92, వెల : రూ.100/-
ప్రతులకు : పి.వి.ఎల్. సుజాత, సైనిక్‌పురి, సికింద్రాబాద్
ఫోన్ : 7780153709
- తంగిరాల చక్రవర్తి , 9393804472