Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వరల్డ్ పీస్ సొసైటీ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయస్థాయి బహుభాషా కవి సమ్మేళనం నిర్వహించారు. "ఈ యుద్ధాలు ఎవరికోసం" అనే అంశంపైన అశోక హోటల్ కాన్ఫరెన్స్ ఏసీ హాల్ హనుమకొండ వేదికగా సాహితీ బృందావన విహార వేదిక వ్యవస్థాపకులు నెల్లుట్ల సునీత ఈ జాతీయస్థాయి బహుభాషా కవి సమ్మేళనంలో పాల్గొని శాంతి సుందరం అనే కవితను పఠనం చేశారు. ముఖ్య అతిధులు, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ టి రమేష్, ప్రముఖ నవల రచయిత డాక్టర్ అంపశయ్య నవీన్, ప్రొఫెసర్ రామచంద్ర మౌళి, మరియు డబ్ల్యూపిఎఫ్ఎస్ చైర్మన్ ఫౌండర్ సైరాద్దీన్, ప్రొఫెసర్ సురేష్ లాల్ ప్రెసిడెంట్ ఎస్.సుధాకర్ రావు, జనరల్ సెక్రెటరీ ప్రొఫెసర్ నరసింహమూర్తి గార్లు తన కవితల ద్వారా శాంతి సందేశం అందించిన శ్రీమతి నెల్లుట్ల సునీతను ఘనంగా సత్కరించారు. ఈ జాతీయస్థాయి బహుభాషా కవి సమ్మేళనంలో పలు ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి వివిధ భాషల కవులు, కవయిత్రులు ,పలువురు సాహితీవేత్తలు ,ప్రముఖులు పాల్గొన్నారు. వరల్డ్ పీస్ సొసైటీ ఇంటర్నేషనల్ వరల్డ్ పీస్ సొసైటీ ఇంటర్నేషనల్ ఫౌండర్ చైర్మన్ సైరాద్దీన్ కి మరియు నిర్వాహకులకు నెల్లుట్ల సునీత ధన్యవాదాలు తెలియజేశారు. సాహితీవేత్తలు సాహితీ మిత్రులు సునీతను అభినందించారు.