Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి:
ఇల్లు దాటకురో
నువ్వు లొల్లి సేయకురో
గుంపు గూడకురో
నువ్వు జనాల సంపకురో
కరోనా ..కరోనా..కరోనొ..జర దూరం జరుగోనా
కరోనా..కరోనా..కరోనా..జర దిమాక్ వాడోనా "ఇల్లు దాటకురో"
చరణం1:
చెప్పి చెప్పి నోరు పోతుందిరా
కొట్టి కొట్టి లాఠీలు ఇరుగుతున్నయిరా
నీకు భాద్యత లేదా దేశమ్మీద
నీకు సాధ్యం కాదా పాగల్ నువ్వా
నీకు కుటుంబమున్నాదిరా
కొన్ని కాలాలు గడపాలిరా
నీకు దేశం ఉన్నాదిరా
కొన్ని తరాలు నిలపాలి రా
జర సోచో సోచో నా
నహీ సమ్జా హేహే క్యా.. "ఇల్లు దాటకురో"
చరణం2:
కొద్ది రోజులాగితే ఏం కాదురా
పనులన్ని ఆపితే నష్టమేమిరా
పానముంటె సాలుగా పైసలెందుకు ||2||
నువ్వు ఇంట్ల సక్కగుంటె
ఈ గోసలెందుకు
నీకు కుటుంబమున్నాదిరా
కొన్ని కాలాలు గడపాలిరా
నీకు దేశం ఉన్నాదిరా
కొన్ని తరాలు నిలపాలి రా
జర సోచో సోచో నా
నహీ సమ్జా హేహే క్యా... "ఇల్లు దాటకురో"
రచన:తండ హరీష్ గౌడ్
8978439551