Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ యాడాది
చడీచప్పుడు లేకుండా
వచ్చెళ్లిపోయింది ఉగాది!
షడ్రుచుల పచ్చడి ఆస్వాదన
పిండివంటల సువాసన లేకుండానే
పండక్కి
కొత్తబట్టలు కట్టలేదు
కొత్త మామిడి ముక్కలేవు
చెఱుకుగడలు కొరకలేదు
వేప్పువ్వు కొరకు వెతకలేదు
వాట్సప్పుల్లోనే పండుగ శుభాకాంక్షలొచ్చాయి మెండుగ!
ఏదారి నుండొచ్చిందో
మాయదారి కరోనా
మహమ్మారిలా మారింది
మానవాళిపైనే కత్తులు నూరింది!
ఈ మండు వేసవి కాలంలో
మనకు వణుకుపుట్టిస్తుంది
ఎటు నుండి దాడి చేస్తుందోనని
ముక్కూమూతీ మూసుకొని
ఇంట్లోనే వనవాసం!
కారు మబ్బుల్లా
కమ్ముకొచ్చిందీ మార్చిలో
వాన చినుకు దేవుడెరుగు
తుమ్మినా దగ్గినా
ఉరుకులు పరుగులు!
ఐదడుగుల దూరం
జరగాలనేది రూలు!
లేదా మీ మీదే
విరుచుకుపడుతుంది
విరుగుడు లేదు ఈ మొండి
మాయరోగానికి
మరణమే శరణ్యం!
దీని ధాటికి
ఆర్ధికంగా ముందున్నా
ఆధునిక వసతులెన్నున్నా
ప్రపంచదేశాలే ప్రణమిల్లుతున్నాయి?
దీని సాహసానికి దాసోహమన్నాయి!
సూక్ష్మజీవీ! నీకెంత కండకావరం ?
విశృంఖలంగా విజృంభిస్తున్నావు
సమస్త మానవాళి
కన్నీరు కారుస్తున్నారు!
నీ జిమ్మడ,కరోనా కాచుకో!
మేమంతా ఐక్యమై
పరిశుభ్రతే ధ్యేయమై
మూడు వారాలేం ఖర్మ
అంతులేని సహనంతో
నీ అంతం చూసే వరకూ
లాక్ డౌన్ పాటిస్తాం!
ఇంటి పట్టునే వుంటాం!!
ముందు ముందు
నీ వినాశనానికి
మందును కనిపెట్టి
నీ ముందు మోకరిల్లక
నిన్ను మట్టికరిపిస్తాం!!
- షేక్ హుస్సేన్
9611984024