Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం మానవులం
వైవిధ్య జీవరాసులతో
ప్రకృతి ఆడుకుంటున్న దోబూచులాటలో
ఎనలేని చతురులం- మనం
మిలియన్ల యుగాల క్రితం పుట్టి
తోడబుట్టిన జీవులన్నింటిలో ఉత్తమంగా
అధికారం, విచక్షణ, మేథస్సుతో
చక్కని రూపం దాల్చుకున్న అద్భుతం- మనం
ఆదిమ ఆర్థోపాడ్లకైనా, కాలంతర కరోనాకైనా
పేర్లు పెట్టేదే- మనం
తెలిసో తెలియకో పుడమి తల్లిపై మారాం చేస్తూ
వారసత్వపు వనరులను
దోచేదైనా, దాచేదైనా
తుదకు కాపాడుకునే ముద్దు బిడ్డలం కదా- మనం
ఏటా ఎదురయ్యే ప్రకృతి వైపరీత్యాలకు
ఆద్యంతాలను కనిపెట్టి
జీవులన్నింటినీ సురక్షితంగా చూసుకునే
మహత్వపూర్ణ వైద్యులం, వైజ్ఞానికులం కాదా -మనం
తరతరాలుగా దేశ విదేశాలుగా
అగమ్యపోరాటాలు గెలిచి
మానవ ఉనికిని చాటుకున్న విజేతలం- మనం
మన బంధాన్ని,
ప్రకృతితో మన బాంధవ్యాన్ని
మధ్యంతరంగా విడగొట్టే విలన్ లా
దాపురించిన కరోనా అయినా
హంటా అయినా
వేటాడి ఓడించేది-మనం
జీవించడం చేతకాక
నిలవడానికి చోటు లేక
అందమైన ప్రకృతిని విపత్తులో పడేసి
జీవతరంగాలను విలవిలలాడించే దుస్సాహసాలు చేసే వైరస్ లైనా, వైరస్ లాంటి దురాలోచనలేవైనా
కత్తి దూయటమే కాదు కదం నిలిపినా చాలు అంతమైపోతాయని నిరూపిద్దాం-మనం
-పూడుగుర్తి వనజ
రీసెర్చ్ స్కాలర్
మనో విజ్ఞాన శాస్త్రం
ఉస్మానియా విశ్వవిద్యాలయం
సెల్:-8297012744