Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెలి వలపుల కాంతిపుంజం
నా మీదకు పుంజుకుంది
ప్రేమ రేణువులతో నిండిన నా హృదయ మైదానం
చెలి వలపులను ఆదరించుటకు అధరాలై వెలిసింది
కాంతిపుంజం అధరాలను సమీపించగా
ఆనందం విశ్వమంత ఎత్తుకు ఎగిసింది
ఆ అనందమైతే పరమానందంగా ఉంది
కానీ ఈ చర్య నా అస్థిత్త్వాన్నే మాయం చేసింది
ఆ కాంతిపుంజం అధరాలను అంటుకోగా
హృదయ మైదానమంతా ప్రకంపించింది
తునాతునకలై ముక్కలుగా మిగిలింది
అయినా తన ప్రేమ ప్రసరణ ఆగలేదు
అది నిర్విరామంగా సాగుతూనే ఉంది
ఇంకేముంది ముక్కలుగా ఉన్న హృదయం కాస్త
ముక్కలు చెక్కలై పేలిపోయింది
విశ్వమంత ప్రేమ తనది
అణువు కన్న చిన్నది నా హృదయం
ఎలా తట్టుకుంటుంది మరి..
- ఇనుగుర్తి లక్ష్మణా చారి
9441002256
గోపాల్ రావు పేట
కరీంనగర్