Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలు కదిపినా కాటు వేసేను
కరోనా కబంధాలలో చిక్కి శల్యమయ్యేవు
కరోనా కబళించేది మనుషులను కాదు
మానవుల ఆత్మవిశ్వాసాన్ని
ధైర్యంగా ఐక్యతతో దాన్ని ఎదుర్కొందాం
కరోనా కదులుతుంది కదనరంగంలో
దాని కట్టడికై కరవాలం చేపడతాం
నలుదిశలా దాని వ్యాప్తిని అరికడదాం
మనుషుల దేహమే దాని ఆవాసం
మనం తలుచుకుంటే తరిమి కొట్టేయ్యగలం
ఆదమరచినమా! ఆగం చేసెస్తది
కరోనా కట్టడికి కాలు దువ్విన వైద్యులు
కనిపించే కలియుగ దైవాలు
విచ్చలవిడి విహారం విజృంభించును కరోనా
అది మన దేశానికి విపత్తు
అది జరగక ముందే మేల్కొందాం
సామాజిక దూరం పాటిద్దాం
కరోనా సమస్యకు చరమగీతం పాడుదాం
కరోనా అంతం అదే మన పంతం
అందరం ఇంటికే పరిమితమవుదాం
అని ప్రతిజ్ఞ చేద్దాం...
-మద్దిరాల సత్యనారాయణ రెడ్డి
పరిశోధక విద్యార్థి
తెలుగు విభాగం
కాకతీయ విశ్వవిద్యాలయం
చరవాణి..9502771776