Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెప్పలేదంటనక పొయ్యేరు
జనులార మీకిది
తెలియకుంటే నష్ట పొయ్యేరు
మహమ్మారి కరోనదిగో పరుగుపరుగున
వచ్చుచున్నది
మాయలాడిని తరిమికొట్టి సుఖముగా జీవించుమన్నా నిచెప్పు
మహమ్మారికి మందు లేదన్నా
మన దరికి వస్తే
తొలగిపోవుట సాధ్యపడదన్నా
కరోనాకు మందు ఒకటే
శుభ్రతను పాటించుమన్నా
సానిటైజరు సబ్బులను
వెంట వెంటనె వాడుమన్నా నిచెప్పు
తుమ్ము దగ్గులు వచ్చినపుడన్నా
నువు మరువకుండా
ఆసుపత్రికి వెళ్ళవలెనన్నా
డాక్టర్లు చెప్పినట్లు
స్వీయ నిర్బంధమ్ములోన
నీవు వుంటే నీకు సుఖము
భార్య పిల్లలు బతుకునన్నా నిచెప్పు
ఇల్లు దాటి వెళ్ళబోకన్నా
నీవెళ్ళితే మరి కరోనా
నిను దగులుకొనునన్నా
కూరగాయల కొట్టుకాడ
కిరాణమ్ము షాపుకాడ
మాస్కులను ధరియించుమన్నా
దూరమును పాటించుమన్నా నిచెప్పు
డాక్టర్లకు మొక్కవలెనన్నా
మన కోసమున్న
పోలీసుల మరువవలదన్నా
పారిశుద్ధ్య కార్మికులకు
వందనములర్పించుమన్నా
ముఖ్యమంత్రి ప్రధానమంత్రుల
మాటలను పాటించుమన్నా నిచెప్పు
--బండిరాజుల శంకర్ కవి రచయిత