Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రొద్దున్నే పాలు కొనే దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా ,
భారతీయుడి నెత్తి మీద ప్రమాదాల కత్తి నిరంతరం వ్రేలాడుతూనే ఉంటుంది,
పీల్చే గాలిలో కాలుష్యం ,ప్రయాణంలో ప్రమాదం,
రోడ్ల మీద మృత్యు ఘోరాలు ,
కార్పొరేట్ ఆసుపత్రులలో కాలయములు,
పోలీసుల చేతుల్లో లాఠీలు ,బుల్లెట్లు,
ప్రేమికుడి చేతుల్లో యాసీడు సీసాలు ,
అత్తల భర్తల చేతుల్లో కిరోసినాయిలు, అగ్గిపెట్టెలు,
తేలని న్యాయం కోసం జేళ్లల్లో గడిపే జీవితాలు,,
బూటకపు ఎన్కౌంటర్లు,లాకప్ మరణాలు..
అడుగడుగునా ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు,,
ఎటుచూసినా అనైతికత,అనైక్యత,అశాంతి ,అభద్రత, రాజ్యమేలుతున్నాయి...
పొరుగువాడి సమాధి కట్టయిన నేను మాత్రం పునాది కట్టుకోవాలి,
పక్కవాడికి లక్ష రూపాయల నష్టం జరిగిన..
నాకు మాత్రం వంద రూపాయల లాభం జరిగితే చాలు అనే విషపూరిత ఆలోచనలతో..
ఉదయం లేవగానే నాకేదో కావాలి నేనేదో అయిపోవాలి అనే తలంపుతో, ప్రాపంచిక జీవితానికే ప్రాధాన్యత వహించేటటువంటి ఈ మనిషి...
జలగలే జలదరించేలా రక్తాన్ని పీల్చేసే రాక్షసత్వం,
నాగులే నమ్మలేని విధంగా పేగుల్ని పిసికేసే పైశాచికత్వ సంఘటనలు అనునిత్యం పునరావృతం అవుతూనే ఉన్నాయి...
కలల పేర జారిపోయే మన మహిళల వలువలు,
ఫ్యాషన్ల పేరుతో దిగజారే విలువలు,
ఆధునికత ముసుగులోన విశృంఖల చేష్టలు,
కామాంధుల కోరల్లో బలిఅయ్యే యువతులు,
తాగుడు ,జూదాలు
రాజ్యమేలు తున్నాయి ,
మాదకద్రవ్యాలే...మనిషినేలుతున్నాయి,
దోపిడీ ,దౌర్జన్యాలే నిత్యకృత్యమైనాయి ,
శాంతి స్నేహాలే... కనుమరుగవుతున్నాయి...
-- కార్తీక్
ఐఐఐటి ,బాసర.