Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విదేశాల్లో పుట్టి దేశాలను వణికిస్తున్న నీ రూపం..
కోవిడ్-19 అనే నీ పేరు వింటే అందరూ వనుకుతుర్రు..
నీకు ఇంతైన జాలి లేదానే..!
తన,మన అనే బేధం లేదు..
పేద, ధనిక అనే హెచ్చు తగ్గులు లేవు..
అందరినీ ఒక బెంబేలు ఎత్తిస్తున్నవ్..
నా దేశాన్ని పట్టి పీడిస్తున్నవ్..
అందరి కదలికలను ఇంటికి ముడిపెట్టినవ్!
కానీ..!
బిచ్చగాని ఆకలి వేధింపులు నీ కళ్ళల్ల పడ్తలేదా..!
దీనంగా చూసే చూపులు..
నీళ్ళతో నింపుకున్న పొత్తి కడుపులకు
నా సర్కార్ బయిటికి రావొద్దు అంది..
నీ బారున పడొద్దు అంది..!
కానీ
కాగితాలు..
నా సోపతిధారుడు ఇంకా రాలేదు..
వాని ధూప ఎలా తీరిందో అని ప్రశ్నంచుకుంటున్నాయి..?
ఆ ప్రశ్నల తాకిడి నీ ఒంటికి తాక్తలేవ!
అందరి ఇంట్లో ముసలి అవ్వల నవ్వులకు.. వెలుగులు నింపినవ్!
వాళ్ళ బిడ్డలతో ఉండే అవకాశాన్నీ ఇచ్చినవ్!
జంట గాని లాగా ఆదుకుంటా
పగొని లాగా సంపుతా అంటావ్!
స్కేతస్కోపులకు నిద్ర లేదు
లాఠీలకు నొప్పి లేదు..
మా జనానికి చస్తాం అన్న భాదే లేదు..!
ఒకవేళ నువ్వు నా దేశంతో యుద్ధం చేస్తానంటే
మేము అంతా ఒక్కటే అని మరచిపోకు!
పేదోని ఆకలే నీకు ముప్పు..
ప్రతి కన్నీటి సినుకులు నీ సావుకు ముసుగులు.. స్కేతస్కోపులే నీకు ఉరితాడులు..
లాఠిలే నీకు చితి పేర్చే కట్టెలు..
కాగితాలు నీ రోగాన్ని సంపే నిప్పు రవ్వలు!
గుర్తుపెట్టుకో....!
యుద్ధం గెలువడానికి పాండవులే అజ్ఞాతవాసం చేశారు..
నా జనాల జోలికొచ్చిన నిన్ను సంపడానికి..
రోజులు కాదు..
ఎన్ని యేళ్లు అయిన అజ్ఞాత వాసానికి మేమంతా సిద్ధం!
-తాళ్ళపల్లి శివకుమార్
మహాత్మా గాంధీ యూనివర్సిటి, నల్గొండ. ప్రథమ సంవత్సరం.
మీదికొండ, ఘనపూర్ స్టేషన్
జిల్లా: జనగాం
9133232326