Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎందుకు వచ్చావే
ఐన వాళ్ళ ఆకలి తిర్చనియ్యవు!
కన్న వాళ్ళను కడచూపు చూడనియ్యవ్వు!!
నా అనే వాళ్ళతో నాలుగు నిమిషాలు ..
నవ్వుతూ మాట్లాడకుండా చేశావు!
పురుడు పోసిన అమ్మకి
పుట్టెడు దుఃఖం మిగిలింది
నీ రాకతో!
కరోనా...
ఐనా
నీ అంతు చూస్తాం!
నువ్వు విసిరిన ఈ కాలరాత్రి కౌగిలిలో నలిగిపోవడానికి
ఇక్కడ ఉన్నది సామాన్యులు కాదు
యావత్ విశ్వానికి వెలుగు పంచిన భారతీయులు!!
ఆఖండ జంబూద్వీప వెలుగులో నువ్వు నిలబడి ఉండలేవు!!
వెళ్ళిపో...!!
కరోనా...
నువ్వు పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది
అభిమన్యులు కాదు!
పద్మవ్యూహంలో
అర్జునుడిలాంటోళ్ళం!
వ్యూహంకే ప్రతివ్యూహం పన్ని
ఇక్కడ నుండి
పోకుంటే
తరిమితరిమి కొడతాం!
భారత్ పవర్ చూపిస్తాం!!
-పి.భాగ్యలి
ప్రథమ సంవత్సరం,
తెలుగు శాఖ-మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం,నల్లగొండ.