Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో ఉండు
బయటతిరిగి బకరాగానివి కాకు!
ఇతరులతో చెయ్యి కలిపి చెంచాగానివి కాకు!
గుంపులు గుంపులుగా వుండి గుణహినుడివి కాకు!!
కరోనా కోరల్లో చిక్కుకొని
మట్టుగొట్టుకుపోకు!
మిత్రమా!
పోలీసుల మాట వినక
లాక్ డౌను పాటించక
సంఘవిరోధివి కాకు!
కుటుంబాన్ని కోల్పోకు!!
చైనా-ఇటలీ -అమెరికాల
గోస వినపడుతలేదా?!!
ఓ భారతీయుడా భాద్యతగా మసలుకో
వైరస్ ను అరికట్టు!
గుర్తుంచుకో
లాక్ డౌన్
నీకూ- నాకూ రక్ష!!
- ఎం.దుర్గేశ్
ప్రథమ సంవత్సరం,
తెలుగు శాఖ- మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ.