Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరుడా ఓ నరుడా!
ఎందుకు ఇంత అసహనం?
ఎందుకు ఈ అసమర్థత?
వినవా ఇకనైనా ప్రభుత్వం మాట!
ఓ నరుడా!
ఉండలేవా
నిను గన్న నీ తల్లి కోసం!
ఉండలేవా సమాజ శ్రేయస్సు కోసం
నీ ఇంటిలో!!
ఓ నరుడా!
కంటివా కరోనా రక్కసిని!
వింటివా ప్రపంచ హృదయ ఘోషని!!
మరణ మృదగాన్ని!!!
ఓ నరుడా మేలుకో!
సమాజ శ్రేయస్సుకై
భావితరాలకై
ఆకలితో అలమటించే ఆర్తుల కేకలకై
నిను గన్న నీ తల్లి భారతమాతకై!
కరోనా రక్కసి చావుకై!!
ఇకనైనా మేలుకో కాపాడు దేశాన్ని
కాపాడు భావితరాల భవిష్యతని!
ఉండు ఇంటిలో!
అదే దేశానికి శ్రేయస్కరం!!
- రేణుకాదేవి మహేశ్వరం
తెలుగు శాఖ-మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ.