Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నమస్కారమనే సంస్కారంతో
సంస్కారం యొక్క సహకారంతో
అశుభ్రతనే ఆస్కారం లేకుండా
పరిశుభ్రతే
పరిష్కారంగా
కరోనాని కడిగేద్దాం!
భావిభారతంకోసం అడుగేద్దాం!!
అడుగులు తడబడొద్దు!
కడుగుడు కుంటుపడొద్దు!
జాగరూకంగ
కరోనాని కాలరాయాలె!!
ఎందుకోయ్ౌ
ఇంత హైరానా!!
భాగ్యనగరాన్ని
యాదుంచుకో
కబలించిన ప్లేగును పెకలించలేదా మనం!
మరకలద్దిన కలరా ను తుడిచేయలేదా మనం!!
మరిచావ గతం
గతం మరిస్తే భవిష్యత్ లేదుకదా నేస్తం!!
ఇదే మనకు అవగతం కావాలె!!
సామాజిక దూరమే ముద్దంటూ
కరోనా కి హద్దులు గీయ్యాలె!
నిర్భందమనే యుద్ధం చేయ్యాలె!!
అంతర్జాలమే యుద్ధభూమిగా
ఫేస్బుక్, వాట్సప్ లు స్పందించాలె!!
జనచైతన్యాన్నే నినదించాలి!!
సమాజహితమే సందేశంగా
సామరస్యమే సౌభాగ్యంగా
నెత్తుటి కత్తులు లేకుండా
యుద్ధభూమిని రగిలించాలె!!
కరోనాననే మనం కభళించాలె!!
యజ్ఞం,విజ్ఞం కలగలసి
అజ్ఞానాన్నే తొలగించాలె!!
విజ్ఞానంగా
దివిటీలు వెలిగించాలె!!
కరోనాపై మాటు వేసి
వేటు వెయ్యాలె!!
మనమేందో రుజువు జెయ్యాలె!!
- మధు పిల్లుట్ల
తెలుగు శాఖ- మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం,నల్లగొండ.
చరవాణి: 9505463374.