Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా తల్లి
పయనిస్తుంది
కల్మషమెరుగని హంసై!
పరదేశం
పామై ఎదురొచ్చె!
నా తల్లిపై ఏమాత్రం కరుణలేదాయె దానికి!
కాటేసి
కాటికి బాటలు తెరిచె!
ఒళ్ళంతా విషమెక్కే!!
నా తల్లి పాలు తాగి పెరిగితివి గదే
విషాన్నెట్ల చిమ్మినవ్!
ఇప్పుడది
గరళకంఠుని
కంఠాన దాచిన
కాలకోట విషమైంది!!
జీవి మనుగడగకే
పెను విపత్తైంది!!
- తలారి సతీష్ కుమార్
ప్రథమ సంవత్సరం,
తెలుగు శాఖ- మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ
చరవాణి: 76758 31976.