Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలు నువ్వొస్తావనీ అనుకోలేదు!
వచ్చి ఇంత గందరగోళం సృష్టిస్తావని ఊహించనేలేదు!
కుల మత వర్గ భేదం లేకుండా వచ్చినావ్!!
ప్రపంచం గుండెళ్ళో భయం నింపినవ్!
ఇకనైనా ఈ లోకాన్ని విడిచిపెట్టు!!
జ్వరం, దగ్గు, జలుబు
నీ లక్షణాలు!
క్వారంటెన్,ఐసోలేషన్,లాక్ డౌన్
అనే కొత్త పదాలకు నేర్పావు అర్థాలు!!
ప్రపంచం గుండెళ్ళో భయం నింపినవ్!
ఇకనైనా ఈ లోకాన్ని విడిచి పెట్టు!!
ప్రతిఒక్కరూ నీ వల్ల ఇళ్లకే పరిమితమయ్యారు!
అందరూ నీ వల్ల
ఇంటి,ఒంటి పనుల్లో లిీనమయ్యారు!
పేద, ధనిక, మధ్య తరగతి, అనే భేదం లేకుండా వచ్చినవ్!
దేశాల గుండెళ్ళో భయం నింపినవ్!
ఇకనైనా ఈ లోకాన్ని విడిచి పెట్టు!!
నీ రాక తో దేవుడు లేడని
విజ్ఞానం అవసరం అని నిరూపించినవ్!
ముూఢనమ్మకాలతో మూసుకుపోయిన
కన్నులను తెరిపించినవ్!!
పోలీసులు, డాక్టర్లూ, నర్సులు
వీరి సహనానికి పరీక్ష పెట్టినవ్!
జగత్తు గుండెళ్ళో భయం నింపినవ్!
ఇకనైనా ఈ లోకాన్ని విడిచి పెట్టు!!
భయం ముసుగులో భయపడుతున్న
ఈ జనాలను బందీగా ఉంచుతున్నవ్!!
భరితగించి పారిపోతే బందిఖానాలో బంధిస్తున్నవు!!
ఆశ, ఆశయం, ఆర్థిక వ్యవస్థల మీద
దాడి చేశావ్!
మా గుండెళ్ళో భయం నింపినవ్!
ఇకనైన ఈ లోకాన్ని విడిచి పెట్టు!!
విదేశాల్లో పురుడు పోసుకున్న నీవు
మెట్టిల్లు అనుకున్నావా మా దేశానికి వచ్చావ్?
వృద్దులు, కూలీలు, అనాధల
ఆకలి బాధలను రెట్టింపు చేశావ్!!
అందరి గుండెళ్ళో భయం నింపినవ్!
ఇకనైనా ఈ లోకాన్ని విడిచి పెట్టు!!
ఇకచాలు
అన్నీ మూసుకు పో..!
- వీరబాబు గండమళ్ళ
ప్రథమ సంవత్సరం,
తెలుగు శాఖ- మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ,
చరవాణి: 8074187752.