Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా
ఓ కరోనా... !
కనికరం లేదా నీకు
కన్నీళ్లు రాలుతున్నట్లు రాలుతున్నాయి
ప్రపంచ ప్రాణాలు....!
నీ పుట్టినిల్లు చైనా అయినా
నీ మెట్టినిల్లు ప్రపంచ దేశాలన్నీ అయినయి!!
ఇంకా ఎందరి తల్లుల కడుపు కోత చూడాలో
ఎన్ని పసిమొగ్గలు రాలుతాయో
ఎన్ని తాళిబొట్లు తెగుతాయో
ఎవడు చేసిన పాపం ఇది!!
భూమి మీద మా మనుగడ లేకుండా చేయడమే
నీ లక్ష్యమా!!
ఇటలి విలపిస్తుంది
అమెరికా అల్లాడుతుంది
ప్రపంచచమంతా మరణఘోష వినిపిస్తుంది!
నీ వల్ల యుగాంతమేజరిగేనా....!
కంటికి కనిపించని శత్రువు నీవు!
మా స్వీయ నియంత్రణతో నీ పై
యుద్ధం చేస్తున్నాం!
మలేరియానే మట్టి కరిపించిన దేశం ఇది!
ప్లేగు వ్యాధికి పలరు లేకుండా చేసిన గడ్డ ఇది!!
అంతటి మా సంకల్పం ముందు
నీ సమరం ఎంత?
ఓ కోవిడ్..!
నీ 19 కోరలు తెగుతయి చూడు!
ఓ గబ్బిలంలా మమల్నీ మీటర్ దూరం పెట్టానని
గృహ నిర్బంధం చేశానని విర్ర వీగుతున్నావ్..!
నీ నిర్బంధం నిన్ను దూరంగా
ఆ చీకటి గుహలో నిర్భందించుటకై అని మరిచావు!
మా భాషలు, మతాలు వేరైనా
మాకు మనోధైర్యం ఎక్కువే అని మరిచావు!
మా స్వీయ నియంత్రణతో నిన్ను కడిగేస్తాం....!
మిత్రులారా......
నిత్యం మన బతుకు పోరు చేస్తాం!
ఇప్పుడు మనం బ్రతికి ఉండటానికి
ఈ నియత్రణ పోరు చేయలేమా...!
చేద్దాం..
నియంత్రణతో మన విజయాన్ని
ఆ చీకటి గుహలోకి వినపడేలా
చేద్దాం...!!
మళ్లీ ఏ చీకటి గుహ నుండి ఏ గబ్బిలం రాకుండా
దాని కొరలను తెగ నరుకుదాం!
అది వచ్చిన దొడ్డి దారినే
దేశ సరిహద్దు దాటేలా
చేద్దాం ....!!
మిత్రమా......!
ఈ కంటికి కనిపించని శత్రువుతో జరిగే యుద్ధం లో
తుది విజయం!!
- సుధగోని ప్రశాంత్ గౌడ్లి
ప్రథమ సంవత్సరం,
తెలుగు శాఖ-మహాత్మా
గాంధీ విశ్వవిద్యాలయం- నల్లగొండ
సెల్: 9959343242.