Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏమని రాయను?
ఎలా రాయను?
కరుణేలేని ఈ కరోనా గురించి!
చైనాలో పుట్టిందని రాయనా
పుట్టగొడుగుల పెరిగి ప్రపంచాన్ని చుట్టిందని రాయునా??
ఏమని రాయను?
ఎలా రాయను??
కరుణేలేని ఈ కరోనా గురించి
వూహాన్ నగర
వ్యూహామని రాయనా?!
దాహమని రాయనా?!
ఏమని రాయను?
ఎలా రాయను??
కరుణేలేని ఈ కరోనా గురించి
నమస్కారమనే సంస్కారం నేర్పిందని రాయనా??
మనిషి మనిషి కలవకుండానే
మానవులంతా ఒక్కటేయని చాటిందంని రాయనా??
వైద్యులను దేవుళ్ళు చేసిందని రాయనా
ఇంతకుముందు దేవుళ్ళను బొమ్మలు చేసిందని రాయనా?
అగ్రరాజ్యాలకు ఉగ్రరూపమైందని రాయనా?
చిన్నరాజ్యాలను చిధిమేస్తుందని రాయనా?
బయటికొస్తున్న
దాతల గురించి రాయనా..
దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న దీనుల గురించి రాయనా??
కల్మషంలేని ప్రకృతి కాలుష్యాన్ని తగ్గించిందని రాయనా?
మానవ ప్రవర్తన ఎవల్యూషన్ పెంచిందని రాయనా??
జీవితాల జీతాలలో పడిన కోతల గురించి రాయనా!
ఈ విధిరోతపై రాస్తున్న రాతల గురించి రాయనా??
ఏమని రాయును?
ఎలా రాయును?
కరుణేలేని ఈ కరొనా గురించి..
ఈ పోరాటాన్ని జయించిన మృత్యుంజయుల గురించి రాయనా..
పోరాడలేక చావుకు ఆరాటపడుతున్న దేహాల గురించి రాయనా?
ఏమని రాయను?
లాక్ డౌన్ అయిన లోకం గురించి రాయనా!!
ఏ లాక్ లేని ఈ కల్లోలం గురించి రాయనా!!
రక్షకభటులు చూస్తున్న ఇతరుల రక్షణ గురించి రాయునా..
రక్షకభటులకూ రక్షణ నిరీక్షణే అని రాయనా??
ఏమని రాయను?
ఎలా రాయను?
కరుణేలేని ఈ కరోనా గురించి!?
- కంఠం రామాంజనేయులు
తెలుగు శాఖ- మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ.