Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా విజృంభిస్తున్నావ్
విశాల విశ్వం మొత్తంపై!
జన్మించినవ్
ఈశాన్యంలో ఉన్న చైనా దేశాన!!
కంటికి కనబడవు గాని విసురుతున్నావు విషగాలిని!!
తనువు చాలిస్తున్నారు నరులు నీ వల్ల!
ఇటలీ శవాల దిబ్బగా మారినది నీ వల్ల!!
అమెరికా అస్తవ్యస్తం అవుతుంది నీ వల్ల!!!
మాది అఖండ భారతావని
అనేక ఔషాదాల గని!!
కర్కశపు కరోనా...!
నీ బారిన పడి అవస్తపడుతున్న
అభాగ్యులు ఎందరో ఈ జగత్తున!!
కొవ్వు పొరతో రక్షణ ఉందని విర్ర వీగుతున్నవా?
కరోనా..
నీ దాటికి అందరు ఓడిపోయారు
క్వారంటైన్ లోన మాత్రమే!
విసురుతున్నవు సవాలు!
చూపిస్తున్నావ్ నీ ప్రతాపం మా ఊపిరితిత్తులలోన!
తీస్తున్నావ్ మా ఊపిరి నిలువునా!!
మా క్షేమం కోసం శ్రమిస్తున్నరు
వైద్యులు
కర్షకులు
రక్షకులు!!
వారి త్యాగం మరువం ఏ నాటికైన!!
వారికి ఇవే మా పాధాభివందనాలు!!
గడప దాటకుండా
వందనంతో మా ఆరోగ్యమనే
ధనాన్ని కాపాడుకుంటాం ఎది ఏమైనా!!
కరోనా రహిత భారతాన్ని చూస్తాం!!
ఉంటాం..!
ఈ నెల రోజుల హోం క్వారంటెన్ లో
విడిపిస్తాం..!
మా భారతమాతకు
నీవేసిన
సంకెళ్లు మా స్వహస్తాలతో...!!
- చిరుమర్తి ఉమారాణి
ప్రథమ సంవత్సరం
తెలుగు శాఖ-
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ