Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనిపించని అగాధం
వెంటాడుతుంది!
దారి నిండా
కరోనా విషపు ఆనవాళ్ళే కనిపిస్తున్నయ్!
గుండెలో బాధకు కారణమెవరు?
కాలం చేతిలో
అనుకోకుండా బందీ
చేసిందొవరు!
నా ఊరి శెల్కల
మొలకెత్తిన నా చేతులకు
పరాయోడి విషపుపూత
నన్ను బాధిస్తున్నది!
నాయ్నను
అమ్మనూ
ఇన్నాళ్లూ చదువులలోకంలో
మునిగి
వదిలిన!
ఇప్పుడు
నా ఊరిఒడికి చేరిన!
నిన్న మొన్న నా పల్లె గూడు
చెదిరింది అనుకున్న!
ఇప్పుడు
లోకపు మలుపులె చెదిరినయ్ కరోనా వల్ల!
పిడికిల్లు బిగించాం!
సొంత గూటిలో ఉండే
నీకు సమాధి కట్టేస్తం కరోనా!!
- సంధ్యారాణి నిరసనమెట్ల
తెలుగు శాఖ, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ.