Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా...!
కనురెప్ప వాల్చినంత క్షణంలోనే
మా గుండెల్లో గునపంలా దిగిపోతున్నవు!
పది మందిలో కలిసి తిరిగే
మనస్తత్వాన్ని పటాపంచలు చేశావ్!
కరోనా...!
ప్రపంచాన్నే
జైలులో బంధించినవ్!
కుటుంబాలనుల విడగొట్టినవ్!!
తుమ్మినా, దగ్గినా
ఒంటరిగా చేసి
చీకటిగది లాంటి
ఐసొలేషన్ లో
మా ఆత్మీయులను బంధించినవ్!
ప్రాణాలను
నీటి బుడగల్లా చేశ్నవ్!!
గుడిలో దైవం ఉందో లేదో గానీ
వైద్యశాలలో ఉన్న
డాక్టరే మా దైవమెప్పటికీ!
నీ పాలిట యముడు!!
- సుజాత కుప్పగరి
తెలుగు శాఖ- మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం,
నల్లగొండ.