Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేపర్ పై నా కలం కదలట్లేదు!
ఓ కరోనా...!
నీ పేరు పలకాలంటే ఇంత భయమా!
నీ పేరుతో ప్రపంచాన్ని గడ గడ వణికిస్తున్నావ్ కదా!
నీ ఊసే తెలియని దేశాలపై విరుచుకుపడటం నీకు న్యాయమా
ఓ కరోనా..!
ఒక్కటి గుర్తుపెట్టుకో
నువ్వు చంపుతున్నది మనిషి ప్రాణాలే కాదు
మానవునికి ఉన్న ఆత్మీయబంధాలని
ఆశయాలనీ!!
కంటతడి పెడుతున్నా
కరోనాని చూసి కాదు
మనిషి నిర్లక్షపు వైఖరిని చూసి!!
భాద్యతారహిత ప్రవర్తన
అవగాహన లేని వారిని చూసి!!
కంటతడి పెడుతున్నా
రోజురోజుకీ విస్తరిస్తున్న
కరోనాను చూసి!
నిర్మానుష్యంగా మారిన
అందమైన ఇటలిని చూసి!!
గుర్తుచేశావ్...
సంపద మీద ఆశ
పట్టణాలకు దారి తీస్తే
బతుకు మీద ఆశ
గ్రామాలకు దారితీస్తుందని!!
అయినా
కరోనా మహమ్మారీ
నిన్ను తరిమి కొడతాం!
మానవత్వం చావలేదు అని రుజువు చేసేందుకు
తట్టుకోగలవా కరోనా!
విడి విడిగా ఒక్కటై పోరాడుతాం!
అత్యవసరమంటేనే బయిటికొస్తాం!
రక్షక భటులకు
నర్సులకు సహకరిస్తాం!!
మేము
భయపడేట్లేదు జాగ్రత్త పడుతున్నాం!
- సి. రవికిరణ్
ప్రథమ సంవత్సరం
తెలుగు శాఖ-
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం,నల్లగొండ
చరవాణి: 8186919394.