Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జన్మనిచ్చింది తల్లి
ప్రాణాలు తీసే హక్కు నీకెక్కడికిది!!
కరోనా...
నడక నేర్పేది తండ్రి అయితే
బయటికి రాకుండా చేసే హక్కు నీకెక్కడిది!
మహమ్మారి కరోనా...
గోరు ముద్దలు అమ్మ పెడితే
తినడానికి తిండి లేకుండా చేసే హక్కు నీకెక్కడిది!
దరిద్ర కరోనా...
సమస్త ప్రాణాలను వణికిస్తున్నావా...
అమ్మ ఆలనా పాలనా చూస్తే
ఈ జైష్ట్య కరోనా నిండుగా మాస్కులు వేయిస్తుంది!!
ప్రాణ భయంపెట్టినవా
ఓ కంకరరాయి..! కరోనా..!!
ఎందుకు నీకు అంత పగ?
నిన్ను తలిస్తేనే
ఒళ్లు గుగురు పొడుస్తుంది !
పట్టణాల్లో ఉన్న వాళ్ళను
పల్లెల్లోకి చేర్చావు!!
ఢిల్లీ నుండి గల్లి దాక అన్ని మూయించావు!!
ఇకనైనా మేలుకో!
ఓ కరోనా..
ఈ దీన ప్రపంచం మీద
కాస్త దయ చూయించు!!
తల్లి లాంటిదానివనుకుంటాం!!
దేశం మొత్తం దీనంగా ఉంది!
వెళ్లిపో తల్లి వెళ్లిపో
తల్లి..
కల్లు సాకలు పోస్తాం..
వెళ్లిపో తల్లి..
వెళ్లిపో..!
- ప్రణీత మోదుగు
తెలుగు శాఖ- మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం,నల్లగొండ.