Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలకరించడానికి వచ్చినవా?
వచ్చిన దానివి పలకరించిబోక
అందరినీ పట్టుకొని బోతుంటివి!
ఇది నీకు న్యాయమా
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా
అందరిలో కలిస్తివి!
ఆరోగ్యానికి హాని చేస్తివి!!
గుణం-అలవాట్లు
మాలో ఇమిడింపచెయ్యకు!
జీవితాల్లో చీకటిని నింపకు!!
మానవజాతి హద్దులని చెరిపెయ్యకు!!
ఆకలి,కన్నీళ్లు
మాకు విషాద స్మృతులైనా
చీకటి తెరల్ని చీల్చుకుంటూ
డాక్టర్ ల వెలుగులమాటల్తో
నిన్ను మసి చేసే వరకు
మేం కునుకు తీయం!
- కె. శ్రీనివాస్
తెలుగు శాఖ
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ
సెల్: 7661812925