Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీడిగింజలు పోసుకున్న నీ కనులు
ఈ జగత్తుపై పడి చీకటిపొరలను కమ్ముకుంది!
ఆ చీకటికొలనులో పడటానికి నా దేశం
మిగతా దేశాలల కాదు..!
అగ్ర రాజ్యాల జనాలా ప్రాణాలు మింగావు..!
అలాగని
భారత్ ప్రజల ఆత్మలను నీకు అప్పజెప్పడానికి
నా జనాలు సాధువులు కారు!
ఒక్కొక్కరు ఒక్కో నిప్పుకణం..!!
నీ చీకటి విశ్వాన్ని
ఎగబాకే నక్షత్రపు జ్వాలలు..!!
నువ్వు ఏ దిక్కు నుండి వచ్చిన
ధనస్సులాగా వెనక్కి గట్టిగా బిగిసి
లాక్ డౌన్ తో వెలుగులు నింపడానికి
ముందుకు ఎగసిపడతాం..!!
మా కన్నీళ్లు కడగటానికి
పారిశుద్ధ్య కార్మికులు
పోలీసులు
డాక్టర్లూ
నిరంతరం నీ చావుకబుర్లు చెప్పడానికి ప్రసారమాధ్యమాలు
మాకు ఆత్మవిశ్వాసాన్నిస్తున్నయి!
నీ గుండెల్లో గుబులు పెడుతూనే ఉంటయి!!
-వేముల మమత
తెలుగు శాఖ
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ