Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కరోనా మాయదారి కరోనా
మాయదారి కరోనా మహమ్మారి కరోనా
మన దేశం వచ్చింది మన పల్లెకె వచ్చింది
నియంత్రణా నివారణా పరిశుభ్రతలే పాటించు
మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పెంచుకో
నిన్ను నువ్వు కాపాడుకో
కరోనా కరోనా మాయదారి కరోనా
చెయ్యి చెయ్యి కల్ప వద్దు షేక్ హ్యాండ్ ఇవ్వవద్దు
కాలు బయట పెట్టబోకు ఆగం నువ్వు కాక బోకు
మూతికి గుడ్డే నీకు రక్ష చేతుల శుభ్రతే నీకు సురక్ష
పెంచండి పెంచండి దూరాన్ని పెంచండి దేశాన్ని కాపాడండి
కరోనా కరోనా మాయదారి కరోనా
మాయదారి కరోనా మహమ్మారి కరోనా
-
పాట రచయిత: దర్శనం రవీందర్
తెలుగు విభాగం
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ
చరవాణి:ం91 99122 49308