Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎందమ్మా ! గింత పని జేశ్నవ్
గంజి తాగి బతుకుతున్నం
గటక తిని బతికెటోళ్ళం
మా ప్రాణాలు తీయకమ్మా !!
ఆరు కాలాలు కష్టపడ్డం
ఇప్పుడు
అరణ్య వాసం మేం చేసిన్నం
మమల్ని వదులవమ్మా !!
నాగలి కట్టి పొలం దున్నాం
మోట గొట్టి నీళ్లు తోడించాం
చేతులు అన్ని కాయలు కాస్తయ్
మోటు కష్టం చేసేటోళ్ళం మేం!!
తట్టీలో బువ్వ పెట్టుకున్నాం
ఎందుకమ్మా తన్నుకపోతావ్ !!
బాధ లేకుండా ఉందమనుకున్నం
ఎవరినుంచి సోకుతవో అనే భయంల
బతుకు ఈడ్చుతున్నాం
గోస చూసి
వెళ్ళీపో..
కరోనా వెళ్ళీపో !!
- టి. సంపత్
తెలుగు శాఖ- మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ
చరవాణి: 99482 46942