Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉప్పెనలా వీస్తున్న విషపు గాలుల్లో
మనుషుల ఊపిరి హరిస్తున్నది!
కలవరపడుతున్న జాతి
తనను తాను
ఉత్తేజ పరుచుకుంటున్నది!
నడవడికను సరిదిద్దుకుంటున్నది!!
అజ్ఞానసంకెళ్లు తెంచుకుంటూ
పోనిలే...అనే అలవాట్లు మానుకుంటూ
తనను తాను
కాపాడుకుంటున్నది!!
ఈ అనుకోని యుద్ధంలో
లాక్ డౌన్ !
సామాజిక దూరం!
శుచి మా అస్త్రాలు!!
- గడ్డమీది అనిల్ కుమార్
తెలుగు శాఖ- మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ
సెల్: 9182385002