Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుందరమైన ఇటలీని స్మశానంగా మార్చితివి
అమెరికాని అంతం చేస్తానని పంతంబడితివి!
విశ్వ మానవ శ్రేయస్సుకోరే
భారతదేశాన్ని రెక్కలువిరిచి బందీస్తివి!!
ఓ కరోనా తూ బంద్ కరోనా!
పసిగుడ్డు, పడుచు పిల్ల, పండు ముసలి వీరిలో
ఏ ఒక్కరినీ వదలకున్నావు!!
వీళ్ళు నీకు ఏం ద్రోహం చేశారు!?
కడుపులో బిడ్డ
కన్నతల్లి
కన్నెపిల్ల
నీకు ఏం అపకారం చేశారు !?
ఓ కరోనా తూ బంద్ కరోనా!
అన్నమో రామచంద్ర అంటూ వీధుల్లో తిరిగే
అన్నార్తులు నీకెం అన్యాయం చేశారు?
పొట్టకూటికై కడుపు చేతబట్టుకొని వలస వెళ్ళిన
పల్లె బిడ్డలు నీకేం కీడు చేశారు?
ఓ కరోనా తూ బంద్ కరోనా!
నీ పేరే ఒక కర్ణ కఠోరం
నీ వూరొక మృగారణ్యం!!
కోరలు చాచిన పిశాచమా
విషాలు చిమ్మే కాలసర్పమా!!
ఓ కరోనా తూ బంద్ కరోనా
కంటికి కనిపించని ఓ విద్రోహీ
నీకు కూసింతైనా జాలి లేదా!
రవ్వంత అయినా కరుణ లేదా!?
ఇసుమంతైనా శాంతి లేదా!?
ఓ కరోనా తూ బంద్ కరోనా!
- ఎన్.శ్రీశైలం
తెలుగు విద్యార్థి
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ