Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓపిక
ఒకప్పుడు
అనుకున్న కన్నా
ఎంతో విశాలంగా ఉంది
ఖాళీ దారులుగా
నదులు జారుతున్నాయి
దూరంగా కొండలు
ఉండి ఉండి మండుతున్నాయి
నాకు ఇప్పుడు
నదులు వినబడవు
కొండలు కనబడవు
కనుచూపు మేరంతా
మూసుకున్న తలుపులు
కానీ సాయంత్రం
బజారు నిండా మనుషులు
భార్య పడుతున్నట్టు
దిక్కుమాలిన నటన
ముక్కులకు ముసుగులు
ముఖం నిండా అనుమానాలు
ఎవరు
అనుకున్నారు గనుక
మందుల అంగడి
బయట
దూరం దూరంగా
భయపడుతూ ఉంటారని
అందుకే వారికి
ధన్యవాదాలు చెప్పాను
ఆనందం పంట
ఆశగా కోసుకున్నా ను
అక్కడ వజ్రాలున్నాయి
అవి మెరవడం లేదు
విషం పురుగు ఉంటే
ఇంకా కలవడం లేదు
ఓపిక
నా ఓపిక
ఇంత విశాలంగా ఉందని
అనుకుంటే
నమ్మకం
కలగడం లేదు...
కె.బి.గోపాలం
9849062055