Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గిప్పుడు.. లాక్ డౌన్ తో
నగరం నిర్మానుష్యమైంది
నిశ్శబ్దం సంచరిస్తుంటే
చౌరస్తా మూగనోము నోస్తుంది
రహదారులు కర్ఫ్యూ లో మునిగింది
మనిషి కీ మనిషి కీ ఎడం దూరమైన
వాడ జనంతో జలకమాడింది
బతుకు బారమైన ఊరు నిండింది
వాయు కాలుష్యానికి దూరమైన పిచ్చుకలు
ఒక్క తాన జేరి స్వచ్ఛమైన గాలి పీల్చిచిలిపిగ కబురులాడుతున్నయ్
గంతులేస్తూ
స్వేచ్చా గీతం ఆలపిస్తున్నయ్
పసిబిడ్డ తల్లి సంకన జేరినట్టు
తల్లి కోడి రెక్కల మాటున పిల్లలు ఒదిగినట్టు
స్వీయ నిర్బంధంలో పరిశుభ్రత పాటిస్తూ
ఇల్లంతా పిల్లా, పెద్దలతో సందడిగుంది
అంతా ఒక్క తాన జేరి ముచ్చటలతో మునిగింది
కంటికి కనిపించని కరోనా ఎల్లలు దాటి కబలిస్తుంటే విపనిపై మాటు వేసి మృత్యుమృదంగం మోగిస్తుంటే
దాని అడుగు జాడలకథలు
టీ. వి లో వీక్షిస్తున్నం
కాలు గడప దాటాలంటే జంకుతున్న జీవులం
చిన్న, పెద్ద, పేద దనిక పరిదులెంచని చెదిరిన వలస బతుకు బందీలం
హద్దులు లేవు...
సరిహద్దుల కంచెలు లేవు
మనుషుల్లో దానవులు మాయమై
మానవత్వం పొంగుకొచ్చింది
బరోసానిస్తూ మమతలు పంచే పాదాలు కొన్ని గడప దాటాయ్
ఆకలిగొని అభాగ్యులకు
సాయమందించే చేతులు ముందుకొచ్చాయ్
బతుకు ప్రీతి బందుప్రీతై
ఎల్లలు చెరిపేస్తూ
సోదర బావం చాటేస్తూ
ముక్తకంఠంతో విశ్వమంతా
కరోనా పై నగారా మోగిస్తూ
యుద్దగీతి ఆలపిస్తున్నం
భూతం ముత్యాలు
9490437978