Authorization
Thu March 06, 2025 02:28:17 am
ఓ కరోనా మహమ్మారి
ఎక్కడో కంటికి కానరాని
చైనా దేశంలో పుట్టితివి కదా
నీ పుట్టుకే ఒక మహాప్రలయమై
సమస్త మానవ జాతి అంతరించి
పోతుందేమోనని అనిపించేలా
చేశావు కదా..!
సమస్త. మానవులు నీ కోరల్లో
చిక్కి విలవిలలాడుతున్నారు కదా..!
ఎన్నడూ వినని నీ పేరును
రచశావు కదా..!
ఎలా వచ్చావో తెలియదు
ఎలా ఉంటావో తెలియదు
పేదవాడు, ధనికవాడు
మంచివాడు, చెడ్డవాడు
నీ దృష్టితో అందరు ఒక్కటే కదా..!
అందరు మనుషులే కదా..!
గాఢ నిద్రలో ఉన్న మానవ
జాతిని మెల్కొలిపి
మనుషులందరూ ఒక్కటే కదా..!
అనే ఐక్యతను మాకు గుర్తు చేశావు కదా..!
ఇకనైనా పోయి మళ్ళీ రాకు
ఓ కరోనా..!
-ముడావత్ శంకర్ నాయక్
చరవాణి: 8555049636.