Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషికి
ఈ పుడమిపై అడుగుపెట్టక మునుపే
కడుపులోనే ఉసరవెల్లిలాంటి
రంగురంగుల వంకర బుద్ది వ్యక్తిత్వాన్ని నేర్చించాలి.
నా అనేవాడికి కూడా
వదలకుండా
కలబంద నారతో గొంతులుకోసేటట్లు ఉండాలి.
మనిషి
ఈ సమాజంలో మనుగడ సాగించాలంటే
నిలువెల్ల
విషపూరితమైన ఆలోచనలతో
తడిబట్టతో కుతికపిస్కేసే వక్రబుద్దితో ఉండాలి.
మనిషి
ఈ నేలపై పండిన నూకల్ని తిని నాల్గొద్దులు
బత్కుబండి నడపాలంటే
కనిపించిన ప్రతీ మనిషితో లోపలొకటి పెట్టుకోని
బయట ఇంకోలా మసులుకుంటూ
పన్నెండు నాల్కల ధోరణిని నేర్చుకునాలి.
ఓ మనిషి నీ బిడ్డలకు
రాత్రిపూట రోజుకో పాఠం చెప్పు
మనిషి స్వార్థాల గురించి
వెకిలినవ్వుల అర్థాల గురించి
గోడదాపు గుసగుసల గురించి
మోసపూరిత ఆలోచనల గురించి
వెన్నుపోటు పొడిసే కత్తుల గురించి
నమ్మకద్రోహం చేసే మిత్రుల గురించి
చెప్పకపోయావో
ఇక నీ బిడ్డలు మన్నుతిన్న పాములే.
మనిషి
ఈ లోకంలో పదిమందితో కలిసి తిరుగుతూ
పనులు చక్కబెట్టుకొని పదిలంగా జీవించాలంటే
పూటకో అబద్దం
నిమిషానికో మోసం
గంటకో అవినితీ చేయాల్సిందే
లేకుంటే
మనిషి మనుగడ ప్రశ్నార్థకమే..?
మనిషి
ఈ కాలంలో జనంలో కలిసి ముందుగా పరుగెత్తలన్న
జనం ఎన్క అడుగులేస్తూ నడవాలన్న
నిలువెల్ల విషం నింపుకొని
పగను పంటికింద నములుతూ
కూటిలో విషమేసి చంపేసేటట్లు ఉండాలి.
మనిషి
ఈ భూగ్రహంపై జీవించాలంటే
విలువలను తూకమేసి అమ్మాలి
సిద్దాంతాలను తుంగలో తొలి--మనిషి తేనే పూసినకత్తి--లి -అవనిశ్రీ.
మనిషికి
ఈ పుడమిపై అడుగుపెట్టక మునుపే
కడుపులోనే ఉసరవెల్లిలాంటి
రంగురంగుల వంకర బుద్ది వ్యక్తిత్వాన్ని నేర్చించాలి.
నా అనేవాడికి కూడా
వదలకుండా
కలబంద నారతో గొంతులుకోసేటట్లు ఉండాలి.
మనిషి
ఈ సమాజంలో మనుగడ సాగించాలంటే
నిలువెల్ల
విషపూరితమైన ఆలోచనలతో
తడిబట్టతో కుతికపిస్కేసే వక్రబుద్దితో ఉండాలి.
మనిషి
ఈ నేలపై పండిన నూకల్ని తిని నాల్గొద్దులు
బత్కుబండి నడపాలంటే
కనిపించిన ప్రతీ మనిషితో లోపలొకటి పెట్టుకోని
బయట ఇంకోలా మసులుకుంటూ
పన్నెండు నాల్కల ధోరణిని నేర్చుకునాలి.
ఓ మనిషి నీ బిడ్డలకు
రాత్రిపూట రోజుకో పాఠం చెప్పు
మనిషి స్వార్థాల గురించి
వెకిలినవ్వుల అర్థాల గురించి
గోడదాపు గుసగుసల గురించి
మోసపూరిత ఆలోచనల గురించి
వెన్నుపోటు పొడిసే కత్తుల గురించి
నమ్మకద్రోహం చేసే మిత్రుల గురించి
చెప్పకపోయావో
ఇక నీ బిడ్డలు మన్నుతిన్న పాములే.
మనిషి
ఈ లోకంలో పదిమందితో కలిసి తిరుగుతూ
పనులు చక్కబెట్టుకొని పదిలంగా జీవించాలంటే
పూటకో అబద్దం
నిమిషానికో మోసం
గంటకో అవినితీ చేయాల్సిందే
లేకుంటే
మనిషి మనుగడ ప్రశ్నార్థకమే..?
మనిషి
ఈ కాలంలో జనంలో కలిసి ముందుగా పరుగెత్తలన్న
జనం ఎన్క అడుగులేస్తూ నడవాలన్న
నిలువెల్ల విషం నింపుకొని
పగను పంటికింద నములుతూ
కూటిలో విషమేసి చంపేసేటట్లు ఉండాలి.
మనిషి
ఈ భూగ్రహంపై జీవించాలంటే
విలువలను తూకమేసి అమ్మాలి
సిద్దాంతాలను తుంగలో తొక్కేయాలి
బంధాలను బొందలోపెట్టేయాలి
కట్టుబాట్లకు పాడెకట్టలు కట్టాలి
నమ్మకాలను నడియేటిలో ముంచేయ్యాలి
అట్లైతేనే ఇక్కడ బత్కగలవు.
ఓ మనిషి
వీటన్నింటినీ కాదంటే
మానవజాతి ఒకటుండేదనీ
మ్యూజియంలో చూడాల్సిందే రేపటి తరానికి.
ఇకమీదట మంచి మనిషన్నవాడిని
చెదలుపట్టని చరిత్రపుటలో చదువుకోవాల్సిన
దినాలు దగ్గర్లోనేవున్నాయి.
ఓ మనిషి
బయట తిరుగుతున్నావా
తస్మాత్ జాగ్రత్త
మనిషులనే క్రూరమృగాలు తిరుగుతున్నాయి.!?.
ఈ భూగ్రహంపై జీవించాలంటే
విలువలను తూకమేసి అమ్మాలి
సిద్దాంతాలను తుంగలో తొక్కేయాలి
బంధాలను బొందలోపెట్టేయాలి
కట్టుబాట్లకు పాడెకట్టలు కట్టాలి
నమ్మకాలను నడియేటిలో ముంచేయ్యాలి
అట్లైతేనే ఇక్కడ బత్కగలవు.
ఓ మనిషి
వీటన్నింటినీ కాదంటే
మానవజాతి ఒకటుండేదనీ
మ్యూజియంలో చూడాల్సిందే రేపటి తరానికి.
ఇకమీదట మంచి మనిషన్నవాడిని
చెదలుపట్టని చరిత్రపుటలో చదువుకోవాల్సిన
దినాలు దగ్గర్లోనేవున్నాయి.
ఓ మనిషి
బయట తిరుగుతున్నావా
తస్మాత్ జాగ్రత్త
మనిషులనే క్రూరమృగాలు తిరుగుతున్నాయి.!?.
- అవనిశ్రీ
9985419424.