Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయుదమెరుగని
నరమేదంతో నేలనేలుతున్న
మరో మహమ్మారి ధాటికి
దేశాలన్నీ మృత్యుబిడారులవుతుంటే,
రణమో మరణమోనంటూ
లాక్ డౌన్ తో చేస్తున్న సమరం
చరిత్ర మరువని సంగ్రామానికి సాక్ష్యం......
యుద్ధమంటే
బల్లెపుదాడులు బాంబులమోతలు కాదిక్కడ
మానవసంబదాల మారటోరియంతో
క్వారంటైన్ ఐసోలేషన్ లే అస్త్రాలుగా
మనమిప్పుడు ఫ్లైట్ మోడ్ లో ఉంటూ
కరోనాపై ఫైట్ మోడ్ సాగించాలి.....
ఇక క్షమార్హం కానివారు సృష్టించే
విధ్వంసం వికృతాల మధ్య
ఆపత్కాలంలో
మానవాళి అస్థిత్వం కోసం
అహర్నిశలూ శ్రమిస్తున్న
అత్యవసర సేవలకో సెల్యూట్ చెస్తూనే,
ఉపాది కరువై
ఆకలితో అలమటిస్తూ
పొట్టకూటికి నోచుకోని
అన్నార్థుల కడుపు నింపే దానగుణాన్ని
మనలో కూడ ఒకింత ఒలికించుకుందాం.....
-యన్.గోవర్ధన్ రెడ్డి.
98665 04089