Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీవే నా ప్రాణం
నీవే నాధ్యానం
నేవే నా జీవనం
నీవు లేనిదే నేబ్రతకలేను ఏక్షణం
అనుకుంటూ మాట రానివైనా
పవిత్రతకు నిదర్శనమైన
నేవేసిన మూడు ముడులకు
కట్టుబడుతూ
నావలన నీకెన్ని కష్టాల గాయాలు, భరించలేని
అవమానాలు కలుగుతున్నా
నీ పుట్టింటికే మాత్రం ఇసుమంత తెలియ జేయని
నీసహనం అమోఘం
నీ ఆదర్శం అద్వితీయం
పతిగా నాకన్నా
సతిగా నీవే మిన్న
ఇన్ని సద్గుణాలు కలబోసిన
నీవే నాకు కలిగించినావు
ఙ్ఞానోదయం
ఇప్పుడు నే మేలుకోకుంటే
నను చూసి మానవత్వమే
నను చూసి చీదరించుకుంటుంది
ఓ నా సతీ/
అందుకే " రాగ ద్వేషాల కొలిమిలో నేకాలి పోనా,
సమర్పణల సాంగత్యంలో
సాన్నిధ్యం నే పొందనా"
ఇదే నీకు నా నివేదన
- జీ. మల్లికార్జునుడు