Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా ఆలోచనల్ని సంప్రదాయం పేరిట సమాధి చేశావు..
ఆనందం లేని చిరునవ్వుని ముఖానికి పూసుకోవడం అలవాటు చేశావు..
నటించటం చేతకాని నేను ప్రతిక్షణం చచ్చి బతుకుతూనే వున్నాను...
ఆచారం పేర మెడకు తాడేసి..
మర బొమ్మను చేసి ఆడుకుంటూనే ఉన్నావు..
ఆకాశమంత నిస్పృహ కింద నలిగిపోతున్న నాకు..
నువ్వు తగిలిచిన భూదేవంత సహనమనే ఫలకం సాక్షిగా..
రాగద్వేషాల కొలిమిలో నే కాలిపోనా...?
లేక..కాలరాత్రిని తాగి
నా తలరాతను కాటేసిన ఆ కాలనాగుని మనసులో నిందిస్తూ...
పైకి మాత్రం కృత్రిమ నవ్వులు
పులుముకొని
నా జీవితమంతా నీ సమర్పణల సాంగత్యంలో సాన్నిధ్యం పొందానని నే మురిసిపోనా....?!
- పీ వీ యల్ సుజాత