Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడపిల్ల అని కన్నులు ఎర్రనిప్పులు చెరిగిస్తూ
అమ్మపై అరుస్తుంటే !బాధనుమ్రింగి అక్కున చేర్చుకునే
దరిద్రం, ఖర్చు అంటూ నిరంతరం అవమానిస్తుంటే
జాలిగా పాపమే.. పుట్టుక అంటూ చూసే చూపులు
చీకటే నీ జీవితం అంటూ అగాధంలో పడేసే చేతులు
అప్రపంచాన్ని చూసి ఏడిస్తే ధైర్యం నేర్పిన చేతులు
చిట్టి నాచేతులకు మోయలేని భారం చెప్పి నవ్వేనవ్వులు
కనుల నుండి ధారలు తప్ప పెదాలపై నవ్వు లేదాయె
వెలుగు జీవితానికి పరుగులు తీసిన కాళ్లకు సంకెళ్ళు విధించే
ఆంక్షలతో అడుగులు వేయిస్తూ ఇళ్లే పరిమితం చేసే
ధైర్యం కూడగట్టి బయట గాలికోసం అడుగులు వేసే
అతిభయంకరంగా నంజుకు తినే నంచుకులా కామచూపులు
భరించలేని బాధలు.. పరుగులు తప్పా తీరని దొరకని జీవనం
నేను అబల కాదని సబలనని పిక్కటిల్లేలా చెప్పే
ప్రయత్నంలో నోరు చేతుల్ని కట్టేస్తున్న చేతుల్లో
రాగద్వేషాల్ని కొలిమిలో నే కాలిపోనా,
సమర్పణల సాంగత్యంలో సాన్నిధ్యం నే పొందినా !
అర్ధంకాని పయనంలో నిరంతరం నలిగిపోయే నాజీవితం....
- శ్రీమతి సాయి రమణి చెన్న