Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉట్నూర్
ప్రతి విద్యార్థి పరిశుభ్రత పాటించడంతోనే వ్యాధులు దూరమవుతాయని నర్సాపూర్(బి) సర్పంచ్ కళావతి సూచించారు. శుక్రవారం మండలంలోని నర్సాపూర్(బి) గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కళావతి మాట్లాడుతూ ప్రతి బాలిక కౌమర దశ నుంచి మంచి పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నారు. నిత్యం ఐరన్, విటమిన్లు ఉన్న పోషకాహారం తీసుకోవాలని సూచించారు. భోజనం చేసే సమయంలో శుభ్రంగా చేతులు కడుక్కోవాలని తెలిపారు. అనారోగ్యం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి, ఆశ్రమ పాఠశాలను ఉపాధ్యాయులు ఉన్నారు.