Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉట్నూర్
పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులపై ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఉట్నూర్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గారాణి ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలల్లో గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వంటశాలను పరిశీలించి భోజన సౌకర్యాలను సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించి అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. పాఠశాలల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని పెట్టాలన్నారు. పాఠశాలలో నిత్యం అపరిశుభ్రంగా ఉండకుండా చూసుకోవాలని, అనారోగ్యాల బారిన పడకుండా చూసుకునే బాధ్యత సిబ్బందిపైన ఉందన్నారు. అనంతరం కుమురం భీం ప్రాంగణంలోని గిరివికాసం ప్రత్యేక బాలబడిని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. జడ్జి వెంట ఉట్నూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాపురెడ్డి, న్యాయవాదులు జమీర్ ఖాన్, జగన్, గిరి ఉన్నారు.