Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు
నవతెలంగాణ-కాగజ్‌నగర్
కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరు మూడో డోసు టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని బీజేపీ నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు సూచించారు. ప్రధాని నరేంద్రమోడీ జన్మదినం పురస్కరించుకొని సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా సర్‌సిల్క్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి కరోనా వ్యాక్సీన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. స్వయంగా తానే పలువురికి టీకా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్నాయనీ, మన దేశం మాత్రం స్వతంత్య్రంగా తయారుచేసుకున్న వ్యాక్సీన్‌తో ఆ మహమ్మారి నుండి బయటపడ్డామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అన్నం మారయ్య, నాయకులు గోలెం వెంకటేష్, దెబ్బటి శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్, బూరం రాజు, జనార్దన్, అర్జున్, డొంగ్రి అరుణ్ పాల్గొన్నారు.