Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాగజ్‌నగర్
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అమలు చేయకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అంజయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1956లో ఏర్పాటైన కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ప్రస్తుతం 30 వార్డులు ఉన్నాయనీ, 2021లో మాస్టర్ ప్లాన్‌కు మున్సిపల్ తీర్మాణం చేసినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. మాస్లర్ ప్లాన్ అమలుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, రోడ్లు, ప్రధాన చౌరస్తాల విస్తరణ చేపట్టాలని, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా రోడ్లను ఇష్టారీతిన తవ్వుతున్న మిషన్ భగీరథ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, మంచినీటి సమస్య పరిష్కరించాలని, సులభ్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయడంతో పాటు నిరుపయోగంగా ఉన్న స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లను వాడకంలోకి తేవాలని, అండర్‌గ్రౌండ్ మురికి కాలువ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ముంజం ఆనంద్‌కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చాపిలె సాయికృష్ణ, ఉపాధ్యక్షులు మీసరి చిరంజీవి, టీఏజీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్, ఐద్వా జిల్లా కార్యదర్శి దుర్గం అనిత, నాయకులు జగదీష్ బరాయ్, సుధాకర్, రవి, లక్ష్మి, తిరుపతి పాల్గొన్నారు.