Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేల
బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను గౌరవిస్తూ వారికి చీరలను కానుకగా ఇస్తోందని అదనపు కలెక్టర్ శేష్ రిజ్వాన్ బాషా అన్నారు. మండలంలోని మసాలా గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులను గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీఆర్డీఓ కిషన్, గ్రామ సర్పంచ్ భీంరావ్, ఎంపిటిసి బండి సుజాత, నాయకులు ప్రమోద్‌రెడ్డి, గంభీర్ ఠాక్రే, బండి సుదర్శన్, సతీష్ పవార్, బత్తుల సుదర్శన్ పాల్గొన్నారు.
విజ్ఞాన్ హైస్కూల్లో..
బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తోందని, మహిళలే కాకుండా పిల్లలు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గౌరవిస్తు ఆడుతూ పాడుతూ ఆనందంగా జరుపుకుంటున్నారని గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్లో శనివారం జరిగిన బతుకమ్మ పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల తరుపున అథితులను సన్మానించారు. అనంతరం విద్యార్థులు బతుకమ్మ పాటలపై చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాద్యాయులు సందీప్ పోత్లే, సర్పంచ్ ఇంద్రశేఖర్, ఎస్ఐ కృష్ణకుమార్, నాయకులు ప్రమోద్‌రెడ్డి, గంబీర్ ఠాక్రే, సతీష్ పవార్, ఉపాధ్యాయులు అనిల్ వైద్య, అమోల్ గుండావార్, ఆతుల్ పాల్గొన్నారు.
నేరడిగొండ : సాయి చైతన్య కళాశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు బతుకమ్మను పేర్చి దాని చుట్టూ నృత్యాలు చేస్తూ పాటలు పాడారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ రాజ్‌కిరణ్‌రెడ్డి బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సదాశివ, వైస్ ప్రిన్సిపాల్ కార్తీక్, అధ్యాపకులు శరత్, లింగన్న, నరసింహదాస్, రవి, ముకుందరావు, సాయిరాం పాల్గొన్నారు.
ముధోల్ : మండలంలోని రబ్రీంద, అక్షర, లిటిల్ ఫ్లవర్, సరస్వతి శిశు మందిర్ పాఠశాలతో పాటు ప్రభుత్వ కళాశాలలో ముందస్తుగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో బతుకమ్మను తయారు చేసి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా విద్యార్థినుల నృత్యాలు చేశారు. అనంతరం బతుకమ్మకు స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర, అక్షర, లిటిల్ ఫ్లవర్, శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయినాథ్, సుభాష్, నజీబ్, సారథిరాజు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ వాసీమోద్దీన్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి : మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు, మహిళలు బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ప్రభుత్వం పాఠశాలలకు ఆదివారం నుంచి దసరా సెలవులు ప్రకటించడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చారు. అనంతరం బతుకమ్మ...బతుకమ్మ..ఉయ్యాలో..అంటూ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. ప్రతి రోజు పుస్తకాలతో కుస్తీ పడే విద్యార్థినులు తోటి ఉపాధ్యాయ బృందంతో కలిసి బతుకమ్మ ఆడారు.