Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కౌటాల
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం కౌటాల మండలంలోని తలోడి గ్రామ పంచాయతీలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డల కోసం చీరలు పంపిణీ చేయడం గర్వకారణమన్నారు. నిరుపేదల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ వారి ఆర్తికాభివృద్ధికి ఆహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. ఈ చీర వెలకట్టలేనిదని, ఆడబిడ్డలు తల్లిగారింటికి వస్తే చీర కొన్నమ లేదా అనేదే తప్పా దాని విలువను పరిగణలోనికి తీసుకోవద్దని, ఆడబిడ్డలకు కేసీఆర్ పెద్దన్న లాంటోడని ఆయన అన్నారు. ఇందులో భాగంగా పాత ఆసరా ఫింఛన్ లబ్దిదారులకు కొత్త కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమురం మాంతయ్య, ఎంపీడీఓ నస్రుల్లాఖాన్, సర్పంచ్‌లు ఒజ్జెల మౌనీష్, సోల్ల శంకరమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆదె వసంత్‌రావు, టీఆర్ఎస్ యువజన సంఘం మండలాధ్యక్షుడు తాళ్లపెల్లి రవీందర్‌గౌడ్, ఉప సర్పంచ్ తిరుపతి, ఐకేపీ ఏపీఎం వెంకటరమణ, మండల మహిళా అధ్యక్షురాలు బండి శైలజ, ప్రభాకర్‌గౌడ్ పాల్గొన్నారు.
తాండూర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే బతకమ్మ చీరల పంపిణీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. శనివారం బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు ఆసరా పింఛన్ కార్డును ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసిన ఆసరా పింఛన్ కార్డులను, దసరా పండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సమన్వయంతో లబ్ధిదారులకు వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని సూచించారు. అనంతరం తాండూర్ ఐబీలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, తహసీల్దార్ కుమారస్వామి, తాండూర్ ఎంపీపీ పూసల ప్రణరు కుమార్ జడ్పీటీసీ బానయ్య ఎంపీటీసీలు పెర్క రాజన్న, రజిత, మొగిలి శంకర్, మాసాడి శ్రీదేవి, సర్పంచులు క్రిస్టఫర్ రమేష్ పాల్గొన్నారు.
వాంకిడి : మండలకేంద్రంలో శనివారం ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ చీరలు పంపిణీకార్యక్రమానికి మండల ఎంపీపీ విమలాబాయి, జడ్పీటీసీ అజరుకుమార్ పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాదిలాగానేఈ ఏడాది కూడా దసరా, బతుకమ్మ పండుగ కానుకగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎం మహేష్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేదల పక్షపాతి అని ఆసిఫాబాద్ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని బురుగూడ, చిలాటిగూడ, అడ గ్రామపంచాయతీ పరిధిలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు, బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. పండగ సందర్భంగా మహిళలకు ప్రభుత్వం తరఫున సారే రూపంలో చీరే అందించడం జరుగుతుందని అన్నారు. పేదలు వికలాంగులు వితంతువులను ఆదుకోవడమే లక్ష్యంగా పింఛన్ వయసును తగ్గించామన్నారు. దీని ద్వారా అనేకమందికి చేయూత లభించిందన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు గోపాల్, వినోద్, మహేష్, జేనేని లక్ష్మి, ఉపసర్పంచ్ కుమార్, ఎంపీటీసీ రమేష్, బూర్గుడ మాజీ సర్పంచ్ సత్యనారాయణ, మైనార్టీ నాయకులు నిషార్ పాల్గొన్నారు.
వేమనపల్లి : మండలంలో శనివారం రోజున స్థానిక గ్రామ పంచాయతీలో బతుకమ్మ చీరలను తహసీల్దార్ రాజ్ కుమార్ పంపిణీ చేసారు. మండలంలో అన్ని రేషన్ షాప్ లకు బతుకమ్మ చీరలను పంపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుబిడే మధుకర్, ఆర్ఐ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి పోశం, రేషన్ డీలర్ శ్యామ్ సుందర్ పాల్గొన్నారు.