Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరీ
నవతెలంగాణ-మంచిర్యాల
వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాలు చేయడం ద్వారా అభివృద్ధి సాధించవచ్చని జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరీ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంటకోత ప్రయోగాలపై వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, మండల ప్రణాళిక అధికారులకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ, విస్తరణ అధికారులు, మండల ప్రణాళిక అధికారులు వారికి కేటాయించిన గ్రామాలలో సందర్శించి శాస్త్రీయ పద్దతిలో ప్రయోగాత్మకంగా పంటకోత నిర్వహించాలని, రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నిర్వహించిన ప్రయోగాలపై నివేదిక తయారు చేసి అందించాలని, వీటి ద్వారా స్థూల జాతీయోత్పత్తి గణనకు, వ్యవసాయ రంగ పరిశ్రమల స్థాపనకు దోహదపడతాయని తెలిపారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పంటకోత ప్రయోగాలపై వివరించారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి జి.సత్యం, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన పాల్గొన్నారు.